Shubhanshu Shukla | అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ వాయిదా పడింది. నిజానికి మే 29న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా దానిని జూన్ 8వ తేదీకి మార్చినట్లు అమెరికాకు చెందిన వాణిజ్య మానవ సహిత అంతరిక్షయాన సంస్థ యాక్సియమ్ స్పేస్ (Axiom Space), నాసా (NASA) సంయుక్తంగా ప్రకటించాయి. ప్రయోగానికి ముందు సన్నాహాల్లో గుర్తించిన చిన్న సాంకేతిక సమస్య కారణం మిషన్‌ను వాయిదా వేసినట్లు తెలిపాయి. ఇక భారత కాలమానం ప్రకారం జూన్ 8న సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.
ఈ ప్రయోగం ద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. భారత్‌కు చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. ‘స్పేస్ఎక్స్’ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ వ్యోమనౌక ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రకెక్కనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
President Droupadi Murmu | రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ పెట్టొచ్చా..? ప్రథమ మహిళ ప్రశ్న
Jaish-e terrorists | పుల్వామాలో ఎన్కౌంటర్.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం