India tariffs | అమెరికా వస్తువులపై భారత్ ప్రతీకార సుంకాలు..!
India tariffs | భారత (India) వస్తువులపై అమెరికా (USA) విధించిన సుంకాల (Tariffs) కు ప్రతీకారంగా.. అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కు తెలియజేసింది.
India tariffs : భారత (India) వస్తువులపై అమెరికా (USA) విధించిన సుంకాల (Tariffs) కు ప్రతీకారంగా.. అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కు తెలియజేసింది. భారత స్టీల్, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది.
అమెరికా ఇటీవల విధించిన టారిఫ్‌ల కారణంగా 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అందుకే అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని భారత్ తప్పుపట్టింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్‌లు విధించారు. క్రూడ్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు దీనిపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం పడనుంది.
ఇప్పుడు అమెరికా వస్తువులపై ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ తెలియజేయడం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ-వాషింగ్టన్ అత్యంత సమీపానికి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్యలోటును తగ్గించడం కోసం ఈ డీల్ ద్వారా భారత్ చాలా రాయితీలను ఆఫర్ చేసినట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

