Paris Olympics 2024 : మూడో సీడ్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఒలింపిక్స్‌లో నాలుగు సార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన జకో.. పసిడి పతకానికి మరింత చేరువయ్యాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీ ఫైనల్లో ఇటలీ కెరటం లొరెంజో ముసెట్టి Lorenzo Musetti) ఆశలపై జకో నీళ్లు చల్లాడు.
మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన జకోవిచ్ సెమీస్‌లో తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుస సెట్లలో జోరు చూపిస్తూ 6-4, 6-2తో లొరెంజోపై జయకేతనం ఎగురవేశాడు. బంగారు పతకం కోసం జరిగే మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)తో జకో తలపడనున్నాడు. కాంస్య పతకం కోసం జరిగే పోరులో ఫెలిక్స్ అగర్‌ను లొరెంజో ఢీ కొట్టనున్నాడు.
This dream is long lived and fought for. I wanted to compete in the finals of Olympic games for such a long time. Representing my country at a global event is a huge privilege and honor that I cherish. Serbia will have a medal on Sunday!!! Ideeeemooooo 🥳🇷🇸🇷🇸🇷🇸🇷🇸 pic.twitter.com/GLywjKPNNd
— Novak Djokovic (@DjokerNole) August 2, 2024
ఒలింపిక్స్‌లో జకోవిచ్‌కు ఇది 17వ విజయం. 2008 బీజింగ్ విశ్వ క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న జకోవిచ్ ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. అయితే.. నిరుడు నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రికార్డు సాధించిన జకో ఈసారి గోల్డ్ మెడల్ లక్ష్యంగా పెట్రేగిపోతున్నాడు.
Dugo sam sanjao da se u bojama Srbije borim za najsjajnije odličje na Olimpijskim igrama. Velika je čast i privilegija da predstavljam našu zemlju! Srbija će imati medalju u nedelju!!!! Veseli se srpski rodeeeeee 🥳🇷🇸🇷🇸🇷🇸🇷🇸 idemoooo pic.twitter.com/7SqNGnsdLq
— Novak Djokovic (@DjokerNole) August 2, 2024
అయితే.. వింబుల్డన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో చిత్తుగా ఓడిన సెర్బియా ఆటగాడికి గోల్డ్ మెడల్ పోరులో గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం. మరోవైపు శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో అల్కరాజ్ దుమ్మురేపాడు. కెనడాకు చెందిన ఫెలిక్స్ అగర్ అలియస్మిమెపై అలవోకగా గెలుపొందాడు. గంటా 15 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 6-1, 6-1తో గెలుపొందాడు.