Padi Kaushik Reddy | దేశంలో 2లక్షల 2 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన సవాలుకు కాంగ్రెస్, బీజేపీ నోరు మెదపడం లేదని విమర్శించారు.
కేసీఆర్ ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్‌పైనా కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగ ఖాళీల వివరాలు లేవని ఆయన అన్నారు. జాబ్ క్యాలెండర్‌పై ఎవరి సంతకం లేదని పేర్కొన్నారు. తేదీలు, ఉద్యోగ ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులపై ఇష్టమొచ్చినట్లుగా అసభ్య పదజాలంతో దూషించిన దానం నాగేందర్పైనా కౌశిక్ రెడ్డి సీరియస్ అయ్యారు. దానం నాగేందర్‌కు ముఖ్యమంత్రి మైక్ ఇప్పించి తమను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దానం నాగేందర్ సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే.. దానం నీచమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. దానం మాటలన్నీ నిరుద్యోగులను ఉద్దేశించినవేనని చెప్పారు. దానం బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
‘ఏయ్.. మూస్కోవోయ్.. నీయమ్మ.. బయట కూడా తిరగనియ్యం.. నా కొడనా మిమ్మల్ని.. ఏమనుకుంటున్నార్రా మీరు.. ఏయ్ తోలుతీస్తా కొడకా ఒక్కొక్కనిది.. తోలుతీస్తా ఒక్కొక్కనిది.. తొక్కుతా.. తోలుతీస్తా.. ఏమ్.. అరేయ్.. బయటకూడా తిరగనియ్యం చెప్తున్నా. రేయ్ రారా.. రా.. నీయమ్మ ఏం మాట్లాడుతున్నవ్?’ అని దానం చేసిన వ్యాఖ్యలపైనా కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున తిరుగుతున్నా.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు అంటూ సవాలు విసిరారు. లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా అని ప్రశ్నించారు. దానం నాగేందర్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని కౌశిక్ రెడ్డి తెలిపారు. దానం నాగేందర్‌కు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.