హైదరాబాద్ : పాలన చేతకాక ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మరో కొత్త రకం మోసానికి తెర తీసింది. రైతులకు యూరియా(Urea) అందించలేక మొన్నటికి మొన్న యాప్ను తీసుకొచ్చిన ప్రభుత్వం.. అంతలోనే మళ్లీ కార్డులను తీసుకొచ్చింది. ఇది చాలదన్నట్లు యూరియా సరఫరా చేయలేక అపసోపాలు పడుతున్న ప్రభుత్వం కొత్త కొత్త పద్ధతుల్లో రైతులను మోసం చేస్తున్నది. తాజాగా మహబూ బాబాద్ జిల్లాలోని ఓ యూరియా కేంద్రం వద్ద కొత్త రకం మోసం బైటపడింది.
వివరాల్లోకి వెళ్తే..డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలో రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుండానే సిబ్బంది ఇచ్చినట్లు సిబ్బంది రాస్తున్నది. యూరియా బస్తాలు ఇవ్వకుండా నాకు ఇచ్చినట్లు రాసి వెళ్లిపొమ్మన్నారు అంటూ ఓ వృద్ధ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అడుగుతుంటే అక్కడ ఉన్న పోలీసులు నన్ను పంపించేశారు. నా పేరు మీద 8 బస్తాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రాస్తే, నాకు ఏమో చదువు రాదు.. ఇప్పుడు ఆ బస్తాలు ఎవరికి ఇచ్చారు అంటూ ప్రశ్నించాడు. ఇంకోసారి రేవంత్ రెడ్డికి మాత్రం ఓటు వెయ్యను అంటూ మండిపడ్డాడు.
మహబూబాబాద్ జిల్లాలోని యూరియా కేంద్రం వద్ద బైటపడ్డ కొత్త రకం మోసం
డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలో రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రాస్తున్న సిబ్బంది
యూరియా బస్తాలు ఇవ్వకుండా నాకు ఇచ్చినట్లు రాసి వెళ్ళిపొమ్మన్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధ రైతు… pic.twitter.com/NAIAvj6UGw
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2026