Sharad Pawar : ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్ చంద్ర పవార్ (NCP-SCP)’ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ను కలిశారు. ముంబై (Mumbai) లోని మలబార్ హిల్స్ (Malabar hills) లోగల మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్ష బంగ్లా (Varsha Banglaw) లో వీరి భేటీ జరిగింది.
#WATCH | Mumbai: NCP-SCP chief Sharad Pawar meets Maharashtra CM Eknath Shinde at Varsha Bungalow over Maratha reservation and other issues.
(Video: CMO) pic.twitter.com/G9ghGsdfmz
— ANI (@ANI) August 3, 2024
ఈ సందర్భంగా మరాఠా రిజర్వేషన్ల (Marata reservations) తోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు వర్ష బంగ్లాకు చేరుకున్న శరద్ పవార్‌కు ఏక్నాథ్ షిండే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలవేళ కొత్తపొత్తులకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి విజయం సాధించాయి. కూటమి సర్కారును ఏర్పాటు చేశాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కొన్నాళ్ల తర్వాత బీజేపీ కుట్రచేసి శివసేనను చీల్చింది. ఏక్నాథ్ షిండే వర్గం బీజేపీతో జట్టుకట్టింది. అందుకు ప్రతిగా బీజేపీ.. షిండేను సీఎంను చేసింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నేకర్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతటితో ఆగని బీజేపీ ఆ తర్వాత ఎన్సీపీని కూడా చీల్చింది. తన కొడుకు అయిన అజిత్ పవార్.. శరద్ పవార్‌కు హ్యాండిచ్చి బీజేపీతో చేతులు కలిపాడు. అందుకు ప్రతిఫలంగా బీజేపీ.. అజిత్‌పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే వర్గం శివసేనకు, అజిత్‌పవార్ వర్గం ఎన్సీపీకి ఝలక్ ఇచ్చారు. వారికి ఒకటి అరా సీట్లు మాత్రమే కట్టబెట్టారు.