Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘వారణాసి (Varanasi)’ పై దేశవ్యాప్తంగా కాదు… ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లబోతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ సాధించిన అరుదైన ఘనత ఆ మాటలకు మరింత బలం చేకూర్చింది.
ప్రపంచ సినీ అభిమానులకు ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్యారిస్‌లోని లే గ్రాండ్ రెక్స్ (Le Grand Rex) థియేటర్లో ‘వారణాసి’ గ్లింప్స్ ప్రదర్శించబడింది. ఈ థియేటర్లో సాధారణంగా హాలీవుడ్‌కు చెందిన భారీ చిత్రాల టీజర్లు, గ్లింప్స్ మాత్రమే ప్రదర్శిస్తారు. అవెంజర్స్: డూమ్స్‌డే వంటి అంతర్జాతీయ బిగ్ బడ్జెట్ సినిమాల కంటెంట్ కూడా ఇక్కడ ప్లే అవ్వడం విశేషం. అలాంటి ఐకానిక్ స్క్రీన్‌పై ‘వారణాసి’ గ్లింప్స్ ప్రదర్శించబడటం ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన ఘట్టంగా మారింది. ఈ ఈవెంట్లో ప్రదర్శించబడిన తొలి భారతీయ సినిమాగా ‘వారణాసి’ నిలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే విడుదలైన ‘వారణాసి’ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. విజువల్స్, స్కేల్, రాజమౌళి మార్క్ స్టోరీటెల్లింగ్ అన్నీ కలిసొచ్చేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అదే గ్లింప్స్ ప్యారిస్ లాంటి అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించబడటంతో ఈ ప్రాజెక్ట్ నిజంగా గ్లోబల్ సినిమా అన్న ముద్ర వేసుకుంది. లే గ్రాండ్ రెక్స్ థియేటర్లో గ్లింప్స్ ప్రదర్శనపై చిత్ర బృందం తీవ్ర ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇదంతా కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు విజువల్ ట్రీట్ 2027లో ప్రేక్షకులకు చూపిస్తామని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, అందుకు సిద్ధంగా ఉండాలని ఫ్యాన్స్‌కు సందేశం ఇస్తున్నారు.
మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘వారణాసి’… రాజమౌళి మార్క్ యాక్షన్, అడ్వెంచర్, మిథికల్ ఎలిమెంట్స్‌తో ప్రపంచ సినిమా మ్యాప్‌లో ఇండియాను మరోసారి నిలబెట్టేలా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ప్యారిస్ వేదికగా మొదలైన ఈ హంగామా చూస్తుంటే… 2027లో థియేటర్లలో వచ్చే తుఫాన్ ఎలా ఉండబోతోందో ఊహించుకోవడమే అభిమానులకు మిగిలింది.
Merci au Le Grand Rex pour cette projection exceptionnelle.
Et merci Paris, merci au public français, pour cet accueil incroyable. ✨De Varanasi à Paris, l’aventure commence. Rendez-vous en 2027 pour l’épopée complète https://t.co/igKZd75rRY
— Varanasi (@VaranasiMovie) January 6, 2026