అబ్దియాజ్: సొమాలియా రాజధానిలోని బీచ్ వద్ద ఉన్న హోటల్లో ఆత్మాహుతి దాడి(Somalia Attack) జరిగింది. ఆ దాడిలో 32 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. సూసైడ్ బాంబర్, ఓ గన్‌మెన్.. బీచ్ లొకేషన్లో అలజడి సృష్టించారు. సుమారు 63 మంది గాయపడినట్లు పోలీసు ప్రతినిధి అదన్ హసన్ తెలిపారు. అబ్దియాజ్ జిల్లాలో జరిగిన అటాక్‌తో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అల్ షబాబ్ మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సొమాలియాలోని దక్షిణ, సెంట్రల్ ప్రదేశాల్లో అల్ షబాబ్ మిలిటెంట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఆల్ ఖయిదాకు అనుబంధ సంస్థ అయిన అల్ షబాబ్ గత 20 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో రక్తపాతం సృష్టిస్తోంది.