IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన తాల.. నిరుడు కెప్టెన్నీ వదులుకున్నాడు. 43 ఏళ్లున్న ధోనీ వికెట్ల వెనకాల తన సూపర్ టైమింగ్, తన నైపుణ్యంతో అభిమానులను అశ్చర్యపరుస్తున్నాడు. గత సీజన్లో శుభ్‌మన్ గిల్‌ను రెప్పపాటులో స్టంపింగ్ చేసిన మహీ.. 18వ సీజన్ తొలి పోరులోనూ అదే తరహాలో సూర్యకుమార్ యాదవ్‌ను పెవిలియన్ పంపాడు. 0.12 సెకన్లలోనే ధోనీ వికెట్లను గిరాటేయగా .. అసలేం జరిగిందో అర్థంకాలేదు సూర్యకు.
నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సూర్య ఫ్రంట్‌ఫుట్ వచ్చి బంతిని మిస్ అయ్యాడు. అలాంటి అవకాశం కోసమే కాచుకొని ఉన్న ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేయగా.. నమ్మశక్యం కానట్టుగా సూర్య పెవిలియన్ బాట పట్టాడు. అంతేకాదు టెయిలెండర్ మిచెల్ శాంట్నర్ వికెట్‌లోనూ మహీ పాత్ర ఉంది. అంపైర్ నిరాకరించగా.. రివ్యూ తీసుకొని మరీ ముంబైకి షాకిచ్చాడీ లెజెండరీ ప్లేయర్. దాంతో, డీఆర్ఎస్ను ధోనీ రివ్యూ సిస్టమ్ అని పేర్కొంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Wow ! One can change bank notes from bank but behind the wickets one cannot change MS Dhoni ! Nahi badal sakte .. As fast as ever MS Dhoni.
pic.twitter.com/zSRnz8DIXI— Virender Sehwag (@virendersehwag) May 29, 2023
నలభై రెండేళ్ల వయసులో ధోనీ వికెట్ కీపింగ్ స్కిల్స్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు కామెంటేటర్లు, మాజీ ఆటగాళ్లు సైతం ఫిదా అవుతున్నారు. ‘ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ధోనీ చేసిన స్టంపింగ్ నిజంగా అద్భుతం. మెరుపు వేగంతో వికెట్లను గిరాటేసి సూర్యను పెవిలియన్ చేర్చాడు. నలభైల్లోనూ ధోనీలో వికెట్ కీపింగ్ నైపుణ్యం ఇసుమంతైనా తగ్గలేదు. చెప్పాలంటే అతడు ఫైర్ మీదున్నాడు. ఈ సీజన్లో ఇలాంటి స్టంపింగ్స్ ఇంకెన్ని చేస్తాడో’ అంటూ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అన్నాడు.
THE REFLEXES OF MS DHONI AT 43. 🥶
– 0.12S for that Sky stumping. 🤯 pic.twitter.com/Pl50olc1od
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2025
సొంతమైదానంలో బౌలర్లు విజృంభించగా ముంబైని 155 పరుగులకే కట్టడి చేసింది చెన్నై. నూర్ అహ్మద్(4-18), అశ్విన్‌లను ఎదుర్కోలేక తిలక్ వర్మ(31), సూర్యకుమార్ యాదవ్(29).. ఆఖర్లో దీపక్ చాహర్(28) ధనాధన్ ఆడి పోరాడగలిగే స్కోర్ అందించారు. అనంతరం ఛేదనలో యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్(3-32) ముప్పతిప్పలు పెట్టినా.. ఓపెనర్ రచిన్ రవీంద్ర(65*) అజేయ అర్ధ శతకంతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. 4 వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టగా.. వరుసగా 13వ సారి ముంబై తమ తొలి మ్యాచ్‌లో పరాభవాన్ని మూటగట్టుకుంది.