MS Dhoni : ఐపీఎల్‌లోనూ దిగ్గజ ఆటగాడిగా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni ) లేటు వయసులోనూ బ్యాటుతో రఫ్ఫడిస్తున్నాడు. సిక్సర్లతో చెలరేగుతూ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. సీఎస్కే అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘తాలా’కు ప్రస్తుతం 43 ఏళ్లు. అతడు మరో సీజన్ ఆడడం బహుశా కష్టమే. కానీ, ధోనీ ఇంకొన్ని ఎడిషన్లు ఆడతాడని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మహీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)పై విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన ధోనీ.. వయసురీత్యా మరో సీజన్ ఆడడంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ‘ఐపీఎల్ ఆరంభం నుంచి మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానులను మర్చిపోలేను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడుతున్నాను. అయితే.. నేను ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలుకుతాను అనేది చాలామంది ఊహించలేరు.
ఇప్పటికే నా శరీరంపై భారం పడుతోంది. అందుకే.. ఐపీఎల్ 18వ సీజన్ ముగియగానే 6 నుంచి 8 నెలల పాటు నా శరీరంపై దృష్టి సారిస్తాను. ఒత్తిడిని ఎంత వరకూ తట్టుకుంటుంది? అనే విషయమై అంచనాకు వస్తాను. కాబట్టి.. మరో సీజన్ ఆడడంపై ఇప్పుడే స్పష్టమైన నిర్ణయం వెల్లడించలేను’ అని ధోనీ వెల్లడించాడు. ఈ ఎడిషన్‌లో ఫినిషర్‌గా అలరిస్తున్న సీఎస్కే బుధవారం కోల్‌కతాపై 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా 12 మ్యాచుల్లో 180 రన్స్ కొట్టాడు.
No MS Dhoni fan can scroll past without liking this video.pic.twitter.com/l9z8IbIb1X
— ` (@rahulmsd_91) May 7, 2025
పద్దెనిమిదో ఎడిషన్‌లో ఆటగాడిగా బరిలోకి దిగిన ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో మళ్లీ పగ్గాలు చేపట్టాడు. అప్పటికే సీఎస్కే వరుసగా 4 ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. ఆ పరిస్థితుల్లో ధోనీ మ్యాజిక్ చేయలేకపోయాడు. దాంతో, 8 ఓటములతో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంకేముంది.. మహీ ఐపీఎల్ కెరియర్‌పై చర్చలు మొదలయ్యాయి.
తమ అభిమాన క్రికెటర్ మరో సీజన్ ఆడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ, ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ధోనీనే. ఈ నేపథ్యంలో మహీకి మరో సీజన్ ఆడగల సత్తా ఉందని సూపర్ కింగ్స్ మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా (Suresh Raina) వ్యాఖ్యానించాడు. అయితే.. చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం తమకు ధోనీ ఏమీ చెప్పలేదని అన్నాడు. దాంతో, 19వ సీజన్ ఆరంభం అయ్యే సరికి తాలా భవితవ్యం తేలిపోనుంది.