Jammu Airport | న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్ము ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. గురువారం రాత్రి ఆత్మాహుతి డ్రోన్లతో పాక్ దాడులకు దిగింది. ఎయిర్‌పోర్టుకు సమీపంలో రెండు శక్తివంతమైన పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. పాక్‌కు చెందిన డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలను సైరన్లతో భారత సైన్యం అప్రమత్తం చేసింది. ప్రజలంతా తమ నివాసాల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. జమ్ములోని కిష్టావర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు.
#WATCH | J&K | A complete blackout has been enforced in Akhnoor of Jammu Division; sirens are being heard. pic.twitter.com/Jgftczowww
— ANI (@ANI) May 8, 2025