IPL 2025 : పంజాబ్ కింగ్స్ కుర్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(50 నాటౌట్) చెలరేగి ఆడుతున్నాడు. ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు 25 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన ప్రియాన్ష్ ఆ తర్వాత సింగిల్ తీసి యాభైకి చేరువయ్యాడు. మరో ఎండ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్(28 నాటౌట్) సైతం దంచేస్తున్నాడు. ఈ ఇద్దరూ విధ్వంసక బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా పంజాబ్ 69 రన్స్ చేసింది. 7 ఓవర్లకు స్కోర్.. 79.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు దంచేస్తున్నారు. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య(50 నాటౌట్) బౌండరీలతో హెరెత్తిస్తున్నాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు.
Fearless. Free-flowing. Full of flair ❤#PBKS off to a flyer with Priyansh Arya & Prabhsimran Singh going full throttle 👊
They are 69/0 at the end of powerplay.
Updates ▶ https://t.co/R7eQDiYQI9 #TATAIPL | #PBKSvDC | @PunjabKingsIPL pic.twitter.com/rOfeSpoYxs
— IndianPremierLeague (@IPL) May 8, 2025
అనంతరం ప్రభ్‌సిమ్రన్ సింగ్(28 నాటౌట్) స్టార్క్‌ను టార్గెట్ చూస్తూ మూడ ఫోర్లు బాది 12 పరుగులు పిండుకున్నాడు. అనంతరం .. చమీర బౌలింగ్‌లో ప్రియాన్ష్ సిక్సర్‌తో పంజాబ్ స్కోర్ 4 ఓవర్లకే 50కి చేరింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనూ సిమ్రన్ 4, ప్రియాన్స్ 6 కొట్టగా 15 రన్స్ వచ్చాయి. ఈ ఇద్దరూ విధ్వంసక బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా పంజాబ్ 69 రన్స్ చేసింది.