IPL : ఇండియన్ ప్రీమియర్ మెగా వేలానికి ముందు ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు ట్రోఫీ లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నాయి. ఐపీఎల్ టైటిల్ కల తీర్చే కెప్టెన్ కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్దమవుతున్నాయి. ఈసారి ముంబై ఇండియన్స్(Mumbai Indians) మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma)పై కోట్ల వర్షం కురువనుందని టాక్.
ముంబైని ఐదు సార్లు విజేతగా నిలిపిన రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కాచుకొని ఉన్నాయి. హిట్‌మ్యాన్‌ను దక్కించుకునేందుకు రూ.50 కోట్లు అయినా వెచ్చించేందుకు ఈ రెండు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయని సమాచారం.
🚨 Big Breaking 🚨
According to Rohit juglan ( Rev sportz ) Delhi capitals and LSG have already saved a purse of 50 crore only for Rohit Sharma 🥶
They only want confirmation from Rohit Sharma pic.twitter.com/g3AXHrQfbL— Vishu (@Ro_45stan) August 23, 2024
రెవ్ స్పోర్ట్స్‌కు చెందిన రోహిత్ జుగ్లన్ విశ్లేషణ ప్రకారం.. మెగా వేలానికి ముందే రోహిత్ శర్మను కొనేందుకు పలు జట్లు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ.50 కోట్లు దాచి పెట్టుకుంది. రిషభ్ పంత్(Rishabh Pant)ను వదిలేసే ఆలోచనలో ఉన్న ఢిల్లీ రోహిత్‌ను ఎలాగైనా తమ కెప్టెన్‌గా నియమించుకోవాలని భావిస్తోంది.
మరోవైపు కేఎల్ రాహుల్(KL Rahul)పై నమ్మకం కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్ సైతం రోహిత్ శర్మపై గురి పెట్టింది. రోహిత్ ఓకే చెప్పడమే ఆలస్యం రూ.50 కోట్లు చెల్లించేందుకు రెడీగా ఉన్నాయి ఈ రెండు ఫ్రాంచైజీలు. 17వ సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిని హిట్‌మ్యాన్ ఫ్రాంచైజీ మారనున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. టీమిండియా 13 ఏండ్ల పొట్టి ప్రపంచ కప్ కలను నిజం చేసిన అతడిని ఢిల్లీ, లక్నోలలో ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి.