అమరావతి : విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో 17 మంది కార్మికుల మరణాలకు, క్షతగాత్రులకు కారణమైన ఎసెన్షియా ఫార్మా కంపెనీని (Essentia company) సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ట్వీట్(Tweet) చేశారు. ఇటువంటి దారుణాలు, మరీ ముఖ్యంగా విశాఖ(Visaka) పరిసరాల్లో మరోసారి జరగకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా నియంత్రణకు పూనుకోవాలని సూచించారు.
సెజ్‌లో భద్రతా పట్ల నిర్లక్ష్యం కనిపించినా వెంటనే ఆ ప్లాంట్లు మూసివేయాలని కోరారు. కంపెనీ నిర్వాహకాలు, ప్రమాదాలపై ఓ సంస్థ నాటి వైసీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, అయితే ప్రభుత్వం నివేదికపై మౌనం వహించిందని ఆమె ఆరోపించారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి ఏమి నేర్చుకోకుండా రిషి కొండను పిండిచేసి రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టుకునేందుకు డబ్బు, తీరిక ఉంటుంది. కాని కార్మికుల ప్రాణాల రక్షణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆక్రోషం వ్యక్తం చేశారు.