IPL Mega Auction : ఐపీఎల్ మెగా వేలం తేదీలు వచ్చేశాయి. ఇక వేలం రోజు పాట మొదలవ్వడమే ఆలస్యం స్టార్ ఆటగాళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతారు. ముఖ్యంగా పవర్ హిట్టర్లు, ప్రధాన పేసర్లు భారీ ధర పలికే వీలుంది. ఈసారి వేలంలో కొందరు ఆటగాళ్లు మళ్లీ పాత జట్టుకే ఆడాలని ఆశపడుతున్నారు. వాళ్లతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ పేసర్ దీపక్ చాహర్ (Deepak Chahar) కూడా ఉన్నాడు. కుడిచేతి వాటం పేసర్ అయిన చాహర్ మెగా వేలం ముంగిట ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈసారి కూడా వేలంలో తనను సూపర్ కింగ్స్ కచ్చితంగా కొంటుందని దీపక్ చాహర్ అన్నాడు. ‘నన్ను సీఎస్కే పక్కా రీటైన్ చేసుకుంటుంది. గత మెగా వేలంలో కూడా చెన్నై నన్ను కొన్నది. అప్పుడు నాకోసం భారీగా ఖర్చు చేసి మరి దక్కించుకుంది. ఇప్పుడు కూడా మళ్లీ నన్ను సీఎస్కే కొనుగోలు చేస్తుంది. ఒకవేళ చెన్నై ఫ్రాంచైజీ నన్ను కొనకుంటే.. నాకోసం రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతుందని ఆశిస్తున్నా’ అని చాహర్ వెల్లడించాడు.
Deepak Chahar said, “CSK will bid for me, I believe. I was not retained by them in the last Mega Auction as well, but they went all out for me and bought me back. I don’t know what’ll happen this year, but I know my skill will be valued more now”. (TOI). pic.twitter.com/VBcCxYA9aP
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2024
ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం గల దీపక్ మరోసారి పప పవర్ ప్లేలో వికెట్ల వీరుడిగా పేరొందాడు. 2018 నుంచి అంటే.. ఆరు సీజన్లుగా పసుపు జెర్సీతో బరిలోకి దిగిన చాహర్ 76 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకూ 81 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పేసర్ 77 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Deepak Chahar talks about his wishes for the IPL Mega Auction 🔥#Cricket #DeepakChahar #IPLAuction pic.twitter.com/Y0LiR8xFEv
— Sportskeeda (@Sportskeeda) November 12, 2024
రాజస్థాన్‌కు చెందిన దీపక్ చాహర్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. నిలకడైన ప్రదర్శనతో ఐపీఎల్ యజమానుల దృష్టిలో పడిన చాహర్ 2016లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఏడాది చాహర్‌ను రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ రూ.10 లక్షల కనీస ధరకే కొన్నది. రెండు సీజన్ల తర్వాత చాహర్‌ను రూ.80 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలో రాటుదేలిన అతడు సీఎస్కే విజయాల్లో కీలకమయ్యాడు. 2022 మినీ వేలంలో చాహర్ ఏకంగా రూ.14 కోట్లు పలకడం విశేషం.