Sreeleela | అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కతున్న మూవీ పుష్ప-2. ప్రస్తుతం ఈ మూవీపై భారీగా అంచనాలున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప ద రైజ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రెండో పార్ట్ పుష్ప ద రూల్ ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కానున్నది. ఇక మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులు వేయనున్నది. ఐటమ్ సాంగ్తోకు మరింత శోభను తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఐటమ్ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల రూ.2కోట్ల పారితోషకం తీసుకున్నట్లు టాక్. కన్నడ బ్యూటీ గతంలో నటించిన గుంటూరు కారం మూవీ రెమ్యునరేషన్‌తో పోలిస్తే చాలా తక్కువ. మహేశ్ బాబుతో కలిసి నటించిన మూవీకి రూ.4కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
అలాగే, పుష్ప ద రైజ్‌లో సమంత రెమ్యునరేషన్‌తో పోలిస్తే శ్రీలీలకు ఇచ్చింది 60శాతం తక్కువ. పుష్ప-1లో సమంత ఊ అంటావా అనే ఐటమ్ సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్‌కు రూ.5కోట్లు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. అయితే, పుష్ప-2లో ఐటమ్ సాంగ్ కోసం మొదట బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్లోని మేకర్స్ సంప్రదించారు. అయితే, ఆమె రూ.5కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్ వినిపించింది. దాంతో నిర్మాతలు శ్రీలీలను సంప్రదించగా ఓకే చెప్పిందని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా..ఈ నెల 17న పాట్నాలో ట్రైలర్ లాంచ్‌ని నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక మూవీ షూటింగ్‌కు చివరి దశకు చేరగా.. ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్‌ని నిర్వహించనున్నారు. పుష్ప-2లో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నది. ఫహాద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. డిసెంబర్ 5న మూవీ విడుదలవనున్నది.