YCP MPs | ఏపీ పరిణామాలపై జోక్యం చేసుకోవాలని మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
YCP MPs | ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.
అమరావతి : ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీలు (YCP MPs ) వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి, డాక్టర్ తనూజా రెడ్డి, బాబురావులు మంగళవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం (Human rights) చైర్పర్సన్ విజయభారతిని కలిసి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారని, 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి ( Peddireddy Sudharani) అనే మహిళలను అరెస్టు చేయకుండా ఐదురోజుల పాటు అక్రమంగా నిర్బంధించి వేధించారని, కార్యకర్తలను బెదిరించి వారితో అనుకూల స్టేట్మెంట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ (Red book) రాజ్యాంగాన్ని నడుపుతుందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, హోంమంత్రి, డీజీపీలు సక్రమంగా పనిచేయడం లేదని వెల్లడించారు. శాంతియుతంగా ఉన్న వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడితే పరిస్థితి ఎక్కడికెళ్తుందో తెలియదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
ఇప్పటికైనా పీఎం, సీఎం జోక్యం చేసుకుని అరాచకాలకు అడ్డువేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఎంపీలు భరోసా ఇచ్చారు. ఏపీ పరిణామాలపై జోక్యం చేసుకుని మానవ హక్కులను , ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
Road accident | తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు, దంపతుల పరిస్థితి విషమం
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

