IND vs ENG 4th Test : రంజీ పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టాడు. రాంచీ టెస్టులో డెబ్యూ క్యాప్ అందుకున్న అతడు నిప్పులు చెరుగుతున్నాడు. బుమ్రా లేని లోటును భర్తీ చేస్తూ ఈ పేసర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ బెన్ డకెట్(11), ఓలీ పోప్(0)లను వెనక్కి పంపి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. 10వ ఓవర్ రెండో బంతికి డకెట్ వికెట్ కీపర్ జురెల్ చేతికి చిక్కాడు.
That Leap! 👏 👏
Akash Deep picks up his 3⃣rd wicket 👌 👌
Zak Crawley departs.
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/fpRGCPG1vT
— BCCI (@BCCI) February 23, 2024
ఆకాశ్ నాలుగో బంతికి ఓలీ పోప్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రోహిత్ సేన రివ్యూ తీసుకుని ఆ తర్వాత వచ్చిన జో రూట్(2 నాటౌట్) కూడా ఎల్బీ అప్పీల్ చేశారు. కానీ, డీఆర్ఎస్లో ఔట్‌సైడ్ వవెళ్తున్నట్టు కనిపించింది. దాంతో భారత జట్టు రివ్యూ కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే ఆకాశ్ డేంజరస్ జాక్ క్రాలే(42)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్ జట్టు 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జో రూట్ (2 నాటౌట్), జానీ బెయిర్‌స్టో క్రీజులో ఉన్నారు.