సర్కస్‌లా కాంగ్రెస్ నేతల టూర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసన సభకు రాకుండా అడ్డుకున్నారు
రాష్ట్రంలో ఫామ్‌హౌస్‌ల చుట్టూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న పర్యటనలు సర్కస్‌లా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.
- కృష్ణా, గోదావరి నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం
- ఎమ్మెల్యేలు, ఎంపీలు అనని మాట లను రాధాకృష్ణ ఎలా రాశారు?
- సీఎం మెప్పుకోసమే తప్పుడు వార్తలు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫామ్‌హౌస్‌ల చుట్టూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న పర్యటనలు సర్కస్‌లా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. అందులో భాగంగానే కేసీఆర్ ఇంటిపైకి ఎమ్మెల్యేలను పంపి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని రైతులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫమైందని దుయ్యబట్టారు.
ప్రభుత్వం కుట్రపూరితంగా రైతుల పంటలను ఎండబెడుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు తాను కూడా తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో స్పష్టంగా పొందుపర్చామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అనుచరుడిగా హడావిడి చేస్తున్న ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పథకం ప్రకారమే ప్రజాభవన్‌లో భేటీలు నిర్వహిస్తూ ఫామ్‌హౌస్‌ల మీదకు నేరస్తుల్లా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల ఆస్తుల్లోకి వెళ్లకూడదనే కనీస న్యాయసూత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలియదా? అని ప్రశ్నించారు. మీ ఇండ్లపైకి కూడా ఎవరైనా వస్తే అనుమతి ఇస్తారా? అని నిలదీశారు.
తెలంగాణకు పట్టుకున్న కాంగ్రెస్ దయ్యం
‘కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం తరఫున వెళ్లారా? పార్టీ తరఫున వెళ్లారా? ఈ మొత్తం డ్రామా వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారా? లేక డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఉన్నారా?’ అనే విషయాన్ని చెప్పాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఐదు రోజులు ఫామ్‌హౌస్‌ల చుట్టూ తిరిగి కాంగ్రెస్ నేతలు సాధించిందేమిటని ప్రశ్నించారు. సీఎంవో, తమ అనుకూల మీడియా హౌస్‌ల నుంచి వచ్చిన స్క్రిప్ట్‌నే కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్ పర్యటనల సందర్భంగా చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. తనకు షాబాద్ మండలం మద్దూరు గ్రామంలో భూమి ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో సైతం పేర్కొన్నానని గుర్తుచేశారు.
ఎయిర్‌పోర్టు పక్కనే విలువైన భూములు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు ఉత్తవేనని కాంగ్రెస్ నేతల పర్యటనతో తేలిపోయిందని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పని విషయాలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎలా రాశారని ప్రశ్నించారు. తనకు వందల ఎకరాల భూములు ఎక్కడ ఉన్నాయో రాధాకృష్ణ చెబితే వాటిని లీగల్‌గా అమ్ముకొనే ప్రయత్నం చేస్తామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మెప్పు కోసమే తనపై నెగెటివ్ వార్తలు రాస్తున్నారా? అని రాధాకృష్ణను ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు వెళ్లాల్సింది.. ప్రైవేట్ ఆస్తుల వద్దకు కాదని ప్రజల సమస్యలు ఉన్న చోటకు వెళ్లాలని హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎమ్మెలే గ్యాదరి కిశోర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, రవీంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

