హనుమాన్-2 ది రైజ్ ఆఫ్ వానరాస్
‘హను-మాన్' యూనివర్స్ నుంచి మరో ప్రతిష్టాత్మక ఫాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హను-మాన్' నిర్మాతలైన కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి తమ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘హను-మాన్’ యూనివర్స్ నుంచి మరో ప్రతిష్టాత్మక ఫాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హను-మాన్’ నిర్మాతలైన కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి తమ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ పేరుతో రానున్న ఈ చిత్రంలో ‘ఉప్పెన’ ఫేం పంజా వైష్ణవ్‌తేజ్ హీరోగా నటిస్తారు. వీఐ ఆనంద్ దర్శకుడు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఎనౌన్స్మెంట్ పోస్టర్ సినిమా కథాంశంపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
ఆకాశమంత ఎత్తులో ఆంజనేయుని తోక.. ఆ తోకపై నిలబడివున్న ఓ వ్యక్తి.. అతని చుట్టూ అలముకొని ఉన్న మేఘాలు.. ఎదురుగా ఆంజనేయుని విశ్వరూప సందర్శనం.. ఇవన్నీ ఈ పోస్టర్లో చూడొచ్చు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హను-మాన్’ స్థాయిని మరింత పెంచేలా ఈ సీక్వెల్ ఉండబోతున్నదని, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించే ఓ మైథలాజికల్ ప్రపంచాన్ని ఈ సినిమా ఆవిష్కరించనున్నదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

