72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తానగర్లో ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను అందజేశారు.

ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కన్నడ ప్రఖ్యాత నటుడు అనంతనాగ్ అందుకోగా.. ‘భ్రమయుగం’ చిత్రానికి గాను మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి, ‘చందు చాంపియన్’ చిత్రానికి కార్తీక్ ఆర్యన్ జాతీయ ఉత్తమ నటులుగా పురస్కారాలను స్వీకరించారు.

ప్రభాస్, అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రధారులుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం జాతీయ ఉత్తమ జనరంజక చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఆ చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం గెలుచుకున్న జాతీయ ఉత్తమ తెలుగు సినిమా పురస్కారాన్ని చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల స్వీకరించారు.