నగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం.. స్తంభించిన ట్రాఫిక్
నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవడంతో పెద్ద ఎత్తున ఉరుముతూ మంగళవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి భగభగమండిన ఎండతో ఉక్కపోతకు నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఒక్క రోజు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది.
- చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు
- పొంగిపొర్లిన నాలాలు.. ముందస్తు చర్యల్లో విఫలం
- ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహన దారులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవడంతో పెద్ద ఎత్తున ఉరుముతూ మంగళవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి భగభగమండిన ఎండతో ఉక్కపోతకు నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఒక్క రోజు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ, సైఫాబాద్, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, మలక్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, బోరబండలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం సమయం కావడంతో ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో మరో రెండు రోజులు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరానికి వాయుగుండం ఎఫెక్ట్ ఉందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.
రోడ్లపై నాలాలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఆ మార్గాలను దాటడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూడళ్ల వద్ద, ట్రాఫిక్ ప్రాంతాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వచ్చింది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద రోడ్లు చెరువులను తలపించడంతో వాహనదారులు ఆ మార్గాలను దాటడానికి సాహసించలేకపోయారు.

బంజారాహిల్స్‌లో..

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

కృష్ణానగర్‌లో..

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంతంలో వర్షం వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్
వర్షపాతం సెం.మీ.లలో..
హిమాయత్‌నగర్‌లో : 3.2
కూకట్‌పల్లిలో : 2.8
ముషీరాబాద్‌లో : 2.5
అబ్దుల్లాపూర్‌మెట్‌లో : 2.5
బాలానగర్‌లో : 2.3
ఖైరతాబాద్‌లో : 2.2
అంబర్‌పేట్‌లో : 2.1
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

