SL vs BAN : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తొలి సిరీస్‌లో శ్రీలంక(Srilanka)విజయం దిశగా సాగుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య లంక పట్టుబిగించింది. ధనంజయ డిసిల్వా(2-13), ప్రభాత్ జయసూర్య(2-47)ల విజృంభణతో బంగ్లాదేశ్‌ను ఆలౌట్ అంచున నిలిపింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్లెత్తేసిన బంగ్లా ఆటగాళ్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరు కొనసాగించారు. ఆఖరి సెషన్ చివరి బంతికి మెహిదీ హసన్ మిరాజ్(11)ను రత్ననాయకే ఎల్బీగా వెనక్కి పంపి.. ఆ జట్టును మరింత దెబ్బకొట్టాడు. దాంతో.. మూడోరోజు ఆట ముగిసే సరికి బంగ్లా ఆరు వికెట్ల నష్టానికి 115 రన్స్ చేసింది. ఇంకా 96 పరగులు వెనకబడి ఉన్న ప్రత్యర్థిని నాలుగో రోజు త్వరగా ఆలౌట్ చేస్తే సిరీస్ లంకకు చిక్కినట్టే.
గాలే టెస్టు డ్రాగా ముగియడంతో నిరాశచెందిన శ్రీలంక.. కొలంబోలో విజయం వాకిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా(2-13), ప్రభాత్ జయసూర్య(2-47)ల విజృంభణతో బంగ్లా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వందకే సగం వికెట్లు కోల్పోయిన జట్టును లిటన్ దాస్(13 నాటౌట్), మెహిదీ హసన్ మిరాజ్(11)లు ఆదుకునే ప్రయత్నం చేశారు.
Sri Lanka tighten the grip! 🇱🇰 Bangladesh end Day 3 on 115/6, still trailing by 96 runs 🏏#SriLankaCricket #SLvsBAN pic.twitter.com/mXNlAStCTQ
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 27, 2025
కానీ, మూడో రోజు ఆట ముగుస్తుందనగా బంగ్లాకు షాకిస్తూ మిరాజ్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు రత్ననాయకే. దాంతో, పర్యాటక జట్టు 115 వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఇంకా 96 పరుగులు వెనకబడి ఉన్న బంగ్లా మ్యాచ్ కాపాడుకోవాలంటే నాలుగోరోజు అసాధారణంగా పోరాడాల్సి ఉంది. కానీ, టెయిలెండర్లతో లిటన్ ఎంతవరకూ పోరాడుతాడనేది ఆసక్తికరం.
Sri Lanka are all out for 458, securing a commanding 211-run lead in the first innings! 💪#SLvBAN #SriLankaCricket pic.twitter.com/owKp1gn2MZ
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 27, 2025
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను సొనాల్ దినుష(3-22), అసితా ఫెర్నాండో(3-51) దెబ్బతీశారు. ఓపెనర్ షద్నాం ఇస్లాం 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శాంటో బృందం 247కే కుప్పకూలింది. పథుమ్ నిశాంక(158) సెంచరీకి దినేశ్ చండీమాల్(93) అర్ధ శతకం తోడవ్వగా లంక 458 రన్స్ చేసింది. దాంతో, ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగుల ఆధిక్యం లభించింది.