శంషాబాద్ రూరల్, జూన్ 27 : రాజేంద్రనగర్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏజీపి)గా శంషాబాద్ మండల పరిధిలోని చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన చెందిన అడ్వకేట్ రామగల్ల వెంకటేశ్ నియామకం అయ్యారు. శుక్రవారం శంషాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో తన సేవలను గుర్తించి రాజేంద్రనగర్ కోర్టు ఏజీపీగా నియమించినందున ధ్యన్యవాదాలు తెలిపారు. తన వద్దకు వచ్చిన కేసులను వాదించి బాధితులకు న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు. అడ్వకేట్ రామగల్ల వెంకటేశ్ స్వగ్రామం శంషాబాద్‌లోని చిన్నగోల్కొండ. అడ్వకేట్‌గా గత 18 సంవత్సరాల నుంచి సేవలందిస్తున్నట్లు వివరించారు. తన సేవలను గుర్తించిన రాజేంద్రనగర్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమించినట్లు చెప్పారు. గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమించడంతో స్నేహితులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.