కాజీపేట, జూన్ 27: కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగింది. కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 49వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో మాదార రమేష్ నివాసం ఉంటాడని తెలిపారు. చెన్నారావుపేట మండలం పాపయ్య పేట్ కు చెందిన అలువాల కాంతమ్మ (55), గత పది రోజుల క్రితం తన తమ్ముడు మాదారపు రమేష్ ఆరోగ్యం సరిగా లేక పోవడంతో చూసేందుకు వచ్చింది.
శుక్రవారం ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి వచ్చి ఆమె మెడ లోని 22 గ్రాముల బంగారం గొలుసును తెంపుకొని పారి పోయాడని చెప్పారు. ఎస్ఐ నవీన్ కుమార్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలిం చారు. బాధితురాలు కాంతమ్మ కాజీపేట పోలీస్ స్టేషన్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు.