David Warner : సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను ఆత్మకథ(Autobiography) రాస్తున్నానని, అందులో సంచలన విషయాలు ఉండబోతున్నాయని, ప్రతి ఒక్కరూ షాక్ అవుతారని డేవిడ్ బాయ్ తెలిపాడు. అయితే.. ఆ పుస్తకం పేరు ఏంటి? ఎప్పడు విడుదల కానుంది? అనే విషయాలు మాత్రం వార్నర్ చెప్పలేదు.
‘అవును.. నేను నా ఆత్మకథ రాస్తున్నా. పుస్తకం ద్వారా ఎన్నో సంచలన విషయాలను మీతో పంచుకోబోతున్నా. ఆ బుక్ ఎందరినో షాక్‌కు గురి చేస్తుంది. అంతేకాదు నా కెరీర్‌ను కుదిపేసిన సాండ్‌పేపర్ వివాదం(Sandpaper Scandal) గురించి కూడా ప్రస్తావించబోతున్నా’ అని వార్నర్ వెల్లడించాడు.
ప్రపంచంలోని విధ్వంసక ఓపెనర్లలో ఒకడిగా పేరొందిన వార్నర్ ఆటకు విజయంతో వీడ్కోలు పలికాడు. అదే సమయంలో వన్డేలకు కూడా రిటైర్మెంట్ పలుకుతున్నానని ప్రకటించాడు. ఇకపై టీ20 లీగ్స్‌లో మాత్రమే కనిపిస్తానని చెప్పిన వార్నర్ ..శరీరం సహకరిస్తే చాంపియన్స్ ట్రోఫీ 2025కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. కెరీర్ ఆసాంతం దూకుడే మంత్రగా ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడైన వార్నర్ ఓపెనర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు.
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా వార్నర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డను అతడు బద్దలు కొట్టాడు. వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. మాస్టర్ బ్లాస్టర్ 342 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.