Madrid Open | మ్యాడ్రిడ్: మహిళల టెన్నిస్లో ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) ఈ ఏడాది మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల టైటిల్ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తుదిపోరులో స్వియాటెక్.. 7-5, 4-6, 7-6 (9/7) తేడాతో రెండో సీడ్ అరీనా సబలెంకను ఓడించింది. 3 గంటల 11 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన ఈ పోరులో స్వియాటెక్నే విజయం వరించింది.