e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home స్పోర్ట్స్ మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా దాస్‌

మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా దాస్‌

మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా దాస్‌

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ శివ్‌ సుందర్‌ దాస్‌ నియమితుడయ్యాడు. ఫీల్డింగ్‌ కోచ్‌గా అభయ్‌ శర్మ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ పర్యటన అనంతం మళ్లీ ఎన్‌సీఏకు వెళ్లనున్నాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వల్ల తన కోచింగ్‌ నైపుణ్యం ఎంతో మెరుగుపడిందని, దీంతో చాలా మంది యువ ఆటగాళ్ల బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దగలుగుతున్నానని దాస్‌ చెప్పాడు. టీమ్‌ఇండియా తరఫున 2000-02 మధ్య శివ్‌ సుందర్‌ 23 టెస్టులు ఆడి రెండు శతకాలు, తొమ్మిది అర్ధశతకాలు సాధించాడు. కాగా భారత మహిళల జట్టు ఈ ఏడాది జూన్‌ – జూలై మధ్య ఇంగ్లండ్‌తో ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహిళల జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా దాస్‌

ట్రెండింగ్‌

Advertisement