IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో శుభ్‌మన్ గిల్(Shubman Gill) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఓపెనర్‌గా శుభారంభం ఇస్తూ.. సారథిగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను విజయాల బాట పట్టిస్తున్నాడు. అలాంటి తనకు టాస్ సమయంలో ఊహించని ప్రశ్న ఎదురైంది. కామెంటేటర్ డానీ మోరిసన్ (Danny Morrison) టాస్ పూర్తయ్యాక గిల్‌ను ఆటపట్టించాడు. ‘నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? ఆ ప్రణాళికల్లో ఉన్నావా?’ అని సరదాగా అడిగా. అందుకు ఏం చెప్పాలో తోచక గుజరాత్ సారథి సిగ్గుపడుతూ నవ్వాడు.
టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. టాస్ కోసమని గిల్, అజింక్యా రహానేతో పాటు గిల్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం గిల్‌తో మాట్లాడిన డానీ మోరిసన్ ‘మ్యారేజ్ ఎప్పుడు?’ అని అడిగాడు. ఏమాత్రం ఊహించని ప్రశ్నకావడంతో గిల్ ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. దాంతో ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు అన్నట్టు నవ్వు ముఖం పెట్టాడు. ఇక కుర్రాడిని మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని మోరిసన్.. ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాడు.
🚨 Toss 🚨@KKRiders won the toss and elected to bowl against @gujarat_titans in Kolkata.
Updates ▶️ https://t.co/TwaiwD5D6n#TATAIPL | #KKRvGT pic.twitter.com/Rof135hqli
— IndianPremierLeague (@IPL) April 21, 2025
టీమిండియా భవిష్యత్ తారగా కితాబులందుకున్న గిల్.. ఈమధ్యే వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం అతడికి 24 ఏళ్లు. చక్కని శరీరాకృతితో హ్యాండ్సమ్గా ఉండే గిల్‌పై చాలామంది అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ యంగ్‌స్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో, బాలీవుడ్ నటి సారా అలీఖాన్(Sara Ali Khan)లతో డేటింగ్ చేస్తున్నాడనే వదంతులు వ్యాపించాయి. అయితే.. గిల్ మాత్రం ఎక్కడా తన లవ్ ఎఫైర్ బయటకు రాకుండా చూసుకుంటున్నాడు. దాంతో, ఎప్పటికైనా జంటగా మారాల్సిందేగా.. అప్పుడు నీ రహస్య ప్రేయసి ఎవరో బయటపడుతుందిలే అని అనుకుంటున్నారు అభిమానులు.