Hyderabad | వెంగళరావునగర్, ఏప్రిల్ 21 : యువతి బాత్రూమ్ లో స్నానం చేసే వీడియో లను రహస్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించేవాడు ఆ కామాంధుడు. నగ్న స్నాన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. బాత్రూమ్ కిటికీ సందులో సెల్ ఫోన్ ఉండగా అనుమానించిన యువతి బిగ్గరగా కేకలు వేసేసరికి.. సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు ఆ పోకిరి. బాధిత యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
బాత్రూంలో మొబైల్ ఫోన్ పెట్టి యువతి స్నానం చేస్తున్న వీడియోలను చిత్రీకరించాడో కామాంధుడు. అయితే కిటికీలో సెల్‌ఫోన్‌ను గమనించిన యువతి.. బిగ్గరగా కేకలు వేసేసరికి సెల్‌ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత యువతి హైదరాబాద్ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యంపొంగు మరియాలి కుమార్ అలియాస్ చిన్నా (20) ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. మధురానగర్‌లో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో యువతి స్నానం చేయడానికి వెళ్లడం గమనించిన చిన్నా.. ఆ బాత్రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో చిత్రీకరించాడు. అయితే కిటికీ పక్కన సెల్‌ఫోన్ గమనించిన సదరు యువతి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో చిన్నా అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ విషయాన్ని సదరు యువతి వెంటనే తన భర్తకు చెప్పింది. అనంతరం ఆ దంపతులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు చిన్నాను అరెస్టు చేశారు. విచారణలో చిన్నా నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే యువతులు స్నానం చేస్తుండగా వీడియోల్ని మొబైల్లో రికార్డు చేసినట్లు చెప్పాడని పేర్కొన్నారు.