IPL 2025 : టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తగ్గేదేలే అంటున్నారు. నిలకడగ ఆడుతూ భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికేశారు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(90), సాయి సుదర్శన్(52). తమ జోడీ ఎంతో పవర్ఫుల్ అని చాటుతూ అదిరే అరంభం ఇచ్చారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ సెంచరీని చేజార్చుకోగా.. ఆఖర్లో జోస్ బట్లర్(41 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. కుర్రాడు షారుఖ్ ఖాన్(11 నాటౌట్)సైతం చెలరేగగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో3 వికెట్లు కోల్పోయి 198రన్స్ కొట్టింది. సొంతమైదానంలో చెలరేగి పోయే కోల్‌కతా బ్యాటర్లు ఛేదనలో ఏం చేస్తారో చూడాలి.
టాస్ ఓడిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (90 : 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సాయి సుదర్శన్(52 :36 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ )లు బలమైన పునాది వేశారు. కోల్‌కతా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీలతో చెలరేగారు. పవర్ ప్లే తర్వాత జోరు పెంచిన గిల్ 34 బంతుల్లోనే అర్ధ శతకం బాదేయగా.. . హర్షిత్ రానా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన సాయి సైతం ఫిఫ్టీకి చేరువయ్యాడు. వీళ్లిద్దరి మెరుపులతో గుజరాత్ స్కోర్ 100 దాటేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీసేందుకు కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానే బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది.
Innings Break!
Batting brilliance from the dynamic trio of Shubman Gill, Sai Sudharsan, and Jos Buttler powers #GT to 1⃣9⃣8⃣ / 3⃣ 💥
A mega chase incoming from #KKR? 🤔
Updates ▶ https://t.co/TwaiwD5D6n#TATAIPL | #KKRvGT | @gujarat_titans pic.twitter.com/nc2SUIVrNM
— IndianPremierLeague (@IPL) April 21, 2025
అయితే.. ఎట్టకేలకు రస్సెల్ విజయవంతమయ్యాడు. డేంజరస్ సుదర్శన్ ఔటయ్యాక జోస్ బట్లర్(41 నాటౌట్) జతగా గిల్ రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదిన అతడు రెండో వికెట్‌కు 58 రన్స్ జోడించాడు. సెంచరీకి చేరువైన గిల్.. వైభవ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడి రింకూ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియా(0)ను హర్షిత్ పెవిలియన్ పంపాడు. వైభవ్ వేసిన 20వ ఓవర్లో బట్లర్ రెండు ఫోర్లు కొట్టగా షారుఖ్ ఖాన్(11 నాటౌట్) ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది.
Brilliant cricket all around 👏
It required a special catch to end Shubman Gill’s fabulous innings of 90(55) 🫡
Updates ▶ https://t.co/TwaiwD5D6n#TATAIPL | #KKRvGT | @KKRiders | @gujarat_titans pic.twitter.com/4rSuIOPCNX
— IndianPremierLeague (@IPL) April 21, 2025