IPL 2025 : ఐపీఎల్18వ ఎడిషన్‌లో నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముంబై ఓపెనర్ ఆయుష్ మత్రే(Ayush Mhatre) ను చేర్చుకున్న సీఎస్కే.. మరో హిట్టర్‌కు స్వాగతం పలికి తమ బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్(Dewals Brewis)తో ఒప్పందం చేసుకుంది. గాయపడిన పేసర్ గుర్జప్నీత్ సింగ్ స్థానంలో ఈ యువ చిచ్చరపిడుగును స్క్వాడ్‌లోకి తీసుకుంది.
నిరుడు వేలంలో రూ.75 లక్షలు పలికిన అతడికి సీఎస్కే ఏకంగా 2.2 కోట్లు చెల్లించనుంది. విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడే బ్రెవిస్ రాకతో చెన్నై బ్యాటింగ్ యూనిట్ పటిష్టం కానుంది. ఐపీఎల్లో ఈ సఫారీ కుర్రాడు 17వ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఆడాడు.
And now, Dewald Brevis is Yellove! 💛#WhistlePodu #Yellove 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2025
గత ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో 21 ఏళ్ల బ్రెవిస్ అదగొడుతున్నాడు. తమ దేశంలో జరిగే ఎస్ఏ టీ20లోనూ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకూ 81 టీ20లు ఆడిన ఈ యంగ్‌స్టర్ 145 స్ట్రయిక్‌రేటుతో పరుగులు సాధించాడు. అయితే.. 18వ సీజ్ వేలంలో మాత్రం బ్రెవిస్‌ను ఎవరూ కొనలేద. అయితే.. ఈమధ్యే దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈ కుర్రాడు ఇప్పుడు చెన్నైకి కీలకం కానున్నాడు. మిడిల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో చెలరేగి ఆడగల సమర్దుడైన బ్రెవిస్ సీఎస్కే తరఫున దంచికొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
Bringing a whole lot of Protea Firepower! 💪🏻#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/9seFMWU1fI
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2025
ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే 18వ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. టాపార్డర్ వైఫల్యం.. పెద్ద లక్ష్యాలను ఛేదించలేకపోవడంతో వరుస ఓటములతో డీలా పడింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించడం కూడా చెన్నై ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మళ్లీ సారథిగా పగ్గాలు అందుకున్న ఎంఎస్ ధోనీ.. లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. కానీ, మిడిలార్డర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో డెవాల్డ్ బ్రెవిస్ రాకతో చెన్నై బ్యాటింగ్ బలం పెరగడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో 5 పరాజయాలతో చెన్నై జట్టు పాయింట్ల పట్టకలో అట్టడుగున నిలిచింది. లక్నోపై విజయంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న ధోనీ సేన.. ఏప్రిల్ 20న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది.