IPL 2025 : ఐపీఎల్18వ ఎడిషన్‌లో పలు జట్లు కీలక ఆటగాళ్ల సేవల్పి కోల్పోతున్నాయి. గాయపడినవాళ్ల స్థానంలో కొత్తవాళ్లను తీసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ (Glenn Philiphs) ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దాంతో, అతడి స్థానాన్ని మరొక ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసింది గుజరాత్. శ్రీలంక ఆటగాడు దసున్ శనక(Dasun Shanaka)తో ఈమధ్యే ఒప్పందం చేసుకుంది.
లంక మాజీ కెప్టెన్ అయిన శనక సుదీర్ఘ టీ20 అనుభవం తమకు కలిసి వస్తుందని గుజరాత్ యాజమాన్యం భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయంగా వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన శనకకు గుజరాత్ రూ.75 లక్షలు చెల్లించనుంది. ఈ విషయాన్ని గుజరాత్ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Tough to see you go, Glenn. 🥺
Wishing you a speedy recovery and safe journey back home 💙 pic.twitter.com/6BWl9t98hA
— Gujarat Titans (@gujarat_titans) April 12, 2025
గుజరాత్ స్క్వాడ్‌లోని ఫిలిఫ్స్ ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకుండానే ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అతడు సబ్‌స్టిట్యూట్ ఫిల్డర్గా మైదానంలోకి వచ్చాడు. అయితే.. ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమైంది. దాంతో, అతడు నొప్పితో మైదానం వీడాడు. వైద్య పరీక్షల అనంతరం ఫిలిఫ్స్‌కు విశ్రాంతి అవసరమని చెప్పారు. అందువల్ల ఈ కివీస్ ఆల్‌రౌండర్ స్వదేశం బయల్దేరి వెళ్లాడు. అతడి స్థానంలో.. అంతే ప్రతిభావంతుడైన శ్రీలంక మాజీ సారథి దసున్ శనకను తీసుకుంది గుజరాత్ ఫ్రాంఛైజీ.
ఐపీఎల్లో గుజరాత్ తరఫున ఆడడం ఇది రెండోసారి. ఇంతకుముందుఈ చిచ్చరపిడుగు 2023లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. మరోసారి చెలరేగిపోయేందుకు సిద్దమవుతున్నాడీ లంక క్రికెటర్. ఇప్పటివరకూ 102 టీ20లు ఆడిన శనక 1,456 పరుగులు సాధించాడు. అంతేకాదు బంతితోనూ విజృంభించి 91 వికెట్లు పడగొట్టాడు.