Athiya Shetty | టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul), అథియా శెట్టి (Athiya Shetty) దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అథియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు గత నెల 24న ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. తాజాగా పాప పేరును అథియా శెట్టి రివీల్ చేశారు (daughter name revealed).
తమ కుమార్తెకు ‘ఎవారా విపుల రాహుల్’ (Evaarah Vipula Rahul) అని నామకరణం చేశారు. పాప పేరును అథియా శెట్టి ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా ప్రకటించారు. ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ‘ఎవారా’ అంటే దేవుడిచ్చిన బహుమతి అని అర్థం అంట. ఇక విపుల తన నానమ్మ (అథియా శెట్టి నానమ్మ) గౌరవార్థం యాడ్ చేసినట్లు తెలిపారు. ఇక చివరిలో తండ్రి పేరు రాహుల్ అని అథియా తన స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఇవాళ కేఎల్ రాహుల్ పుట్టినరోజు సందర్భంగా అథియా శెట్టి తమ కుమార్తె పేరును రివీల్ చేశారు.
బాలీవుడ్ నటి అయిన అథియా శెట్టి.. క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2023 జనవరి 23న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాల్లోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక ఈ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్న వార్తను గతేడాది నవంబర్‌లో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Athiya Shetty
Also Read..
Farewell | బదిలీపై వెళ్తున్న పోలీసు ఆఫీసర్‌కు మేళతాళాలతో ఘనంగా వీడ్కోలు పలికిన స్థానికులు
CM Stalin: ప్రధాని మోదీ ఆరోపణలను ఖండించిన సీఎం స్టాలిన్
Rahul Gandhi : రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించండి.. కర్నాటక సీఎంను కోరిన రాహుల్ గాంధీ