Farewell | సాధారణంగా ఓ ఉద్యోగి ఒకచోటు నుంచి మరొకచోటుకు బదిలీ (Transfer)పై వెళ్తుంటే ఏం చేస్తారు.. తోటి ఉద్యోగులు చిన్న ఫేర్వెల్ (Farewell) పార్టీ అరేంజ్ చేస్తారు. బదిలీపై వెళ్తున్న అధికారిని ఘనంగా సత్కరిస్తారు. తోచిన బహుమతులు ఇచ్చి అతనితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. అయితే, ఓ పోలీసు ఆఫీసర్ బదిలీపై వెళ్తుంటే స్థానికులు మేళతాళాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
దేవరియా (Deoria) జిల్లాలో మదన్‌పూర్ పోలీస్ స్టేషన్ (Madanpur police station) ఇన్చార్జ్ వినోద్ కుమార్ సింగ్ ఆరు నెలల పదవీకాలం ముగిసిన తర్వాత అతన్ని అధికారులు వేరే చోటుకి బదిలీ చేశారు. అయితే, అతని పనితీరుతో స్థానికులకు బాగా దగ్గరయ్యారు వినోద్ కుమార్ సింగ్. దీంతో అతడు ట్రాన్స్‌ఫర్‌పై వెళ్తుంటే స్థానిక ప్రజలు తట్టుకోలేకపోయారు. భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు ఆ పోలీస్ ఆఫీసర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. వినోద్ కుమార్‌ను పూలతో సత్కరించారు. గుర్రాలు, డ్రమ్స్, మేళతాళాల మధ్య అతడిని రోడ్లపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Watch: Drums, Trumpets, Garlands For Transferred Cop’s Farewell In UP https://t.co/NqitILZLYL pic.twitter.com/ceGnDodYTi
— NDTV (@ndtv) April 18, 2025
Also Read..
CM Stalin: ప్రధాని మోదీ ఆరోపణలను ఖండించిన సీఎం స్టాలిన్
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టులు లొంగుబాటు
PM Modi | ఎలాన్ మస్క్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ