న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో కుల వివక్షను నిర్మూలించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ లేఖ రాశారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని రూపొందించాలని కోరారు. తన జీవిత కాలంలో బీఆర్ అంబేద్కర్ కూడా కుల వివక్ష ఎదుర్కొన్నారని తన లేఖలో రాహుల్ హైలెట్ చేశారు. అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్షను రాహుల్ తన లేఖలో ప్రస్తావించారు. తమ వద్ద ఆహారం ఉన్నా.. అంటరానివాళ్ల కావడంతో నీళ్లు ఎవరూ ఇవ్వలేదని, దీంతో తిండి తినలేకపోయినట్లు అంబేద్కర్ స్టోరీని రాహుల్ గుర్తు చేశారు.
తన అభ్యర్థనను కర్నాటక సీఎం సిద్ధరామయ్య అంగీకరిస్తారని, అంబేద్కర్ ఎదుర్కొన్న సిగ్గు చేటు అని, దేశంలో మరో విద్యార్థి అలాంటి బాధకు గురికావొద్దు అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యా వ్యవస్థలో ఇప్పటికీ వివక్ష ఎదుర్కొడం సిగ్గుచేటు అని రాహుల్ తెలిపారు.
రోహిత్ వేముల, పాయల్ తద్వి, దర్శన సోలాంకి లాంటి వారు హత్యకు గురయ్యారని, దీన్ని ఆమోదించలేమని, దీనికి ముగింపు పలకాలని, అంబేద్కర్ లాంటి పరిస్థితిని ఎవరూ ఎదుర్కోకుండా ఉండేందుకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్నాటక ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రాహుల్ తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీన ఆ లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న రోహిత్ వేముల 2016లో కుల వివక్ష తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
हाल ही में संसद में मेरी मुलाक़ात दलित, आदिवासी और OBC समुदाय के छात्रों और शिक्षकों से हुई थी। बातचीत के दौरान उन्होंने बताया कि उन्हें किस तरह कॉलेजों और विश्वविद्यालयों में जाति के आधार पर भेदभाव झेलना पड़ता है।
बाबासाहेब अंबेडकर ने दिखाया था कि शिक्षा ही वह साधन है जिससे… pic.twitter.com/gAwJxr0CIG
— Rahul Gandhi (@RahulGandhi) April 18, 2025