GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 18: గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని రామగుండం ఎన్టీపీసీ కి చెందిన కాంట్రాక్టర్ రాయప్పన్ -నేష దంపతులు అనాథ పిల్లల ఆశ్రమానికి చేయూతనందించారు. గోదావరిఖని గాంధీ నగర్ లో గల ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రం వారు శుక్రవారం అనాథ పిల్లల మధ్య గుడ్ ఫ్రైడే వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా రాయప్పన్ మాట్లాడుతూ ప్రేమ స్వరూపి, లోక రక్షక ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు.
అందుకే ప్రతీ ఏటా గుడ్ ఫ్రైడే రోజున తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు దైవంతో సమానం అని భావించి వారికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజయ్య, ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు.