RS Praveen Kumar | హైదరాబాద్ : సైబర్ క్రైం పోలీసులపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ.. ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
DGP గారు.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లను పట్టుకోవడానికి అహోరాత్రులు సైబర్ పెట్రోలింగ్ చేస్తున్న మన సైబర్ క్రైం పోలీసులకు.. ఎందుకో ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ వాళ్లే కనిపిస్తున్నారు! ఈ రోజు ఎక్స్ వేదికగా మీకు అఫీషియల్‌గానే.. తెలంగాణ గళం మార్ఫింగ్ చేసి.. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలను పంపిస్తున్నా.. ఇది ముమ్మాటికీ తెలంగాణ కాంగ్రెస్ కుట్ర అని నా అనుమానం అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
ఈ దుశ్చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా హింస చెలరేగే ప్రమాదం ఉంది. ఇది 196, 197, 351, 352, 353 బీఎన్ఎస్ కింద నేరం.
లీగల్ ఒపీనియన్ అని తాత్సారం చేయకుండా సుమోటోగా కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుని మాకిచ్చినట్లుగానే వాళ్లకు కూడా Orwellian and Draconian నోటీసులు ఇస్తారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన లింకులు కూడా పంపుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
DGP గారు,
సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లను పట్టుకోవడానికి అహోరాత్రులు సైబర్ పెట్రోలింగ్ చేస్తున్న మన సైబర్ క్రైం పోలీసులకు @TGCyberBureau లకు ఎందుకో ఎప్పుడూ @BRSparty వాళ్లే కనిపిస్తున్నారు!! Surprising revelation on the best police force in the country!ఈ రోజు..
X వేదికగా…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 18, 2025