Children Rights | బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టం ఉక్కుపాదం : లీగల్ సెల్ న్యాయవాదులు
Children Rights | బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టం తన ఉక్కుపాదాన్ని మోపుతుందని, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
మానకొండూర్ : బాలల హక్కులకు ( Children Rights) భంగం కలిగిస్తే చట్టం ( Law ) తన ఉక్కుపాదాన్ని మోపుతుందని, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు ( Legal Cell lawyers) స్పష్టం చేశారు. బుధవారం మానకొండూరులోని పీయంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు మాట్లాడారు.
బాల్య వివాహాలనే మహమ్మారి ఆడపిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తోందని పేర్కొన్నారు. కేవలం వివాహాలే కాకుండా సమాజంలో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టే ‘పోక్సో’చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా నిర్మూలనతో పాటు నేటి తరాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల ముప్పు నుంచి ఎలా బయటపడాలో సోదాహరణంగా వివరించారు.
ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్, ప్యానల్ అడ్వకేట్లు యస్.వి.ఆర్. కృష్ణ, బలుసుల శాంతి కుమార్, తిరుమణి అశ్విని, జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది కొత్తకొండ శంకర్, న్యాయవాది దుంపేటి శ్రీనివాస్ మాట్లాడారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

