IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుస పరాజయాలతో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో సోమవారం సీఎస్కే తలపడనుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ చేరుకున్న చెన్నై ఆటగాళ్లు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. తొలుత అయోధ్యలోని శ్రీ హనుమాన్ గర్హీ దేవాలయంలో పూజలు చేసిన క్రికెటర్లు అనంతరం రామమందిరాన్ని సందర్శించారు.
బాల రాముడిని దర్శనం చేసుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు చెన్నై ఆటగాళ్లకు పూల దండలు వేసి ఆహ్వానం పలికారు. రాముడిని చూసి తరించిన వాళ్లలో ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్, మాజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కంభోజ్.. తదితరులు ఉన్నారు. ఇదివరకు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు సైతం బాల రాముడిని దర్శించుకున్న విషయం తెలిసిందే.
CSK stars with their families seek blessings in Ayodhya! #CSK #AyodhyaDarshan pic.twitter.com/gmvsf40aVN
— Varun Pandey (@varpa2010) April 13, 2025
ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లు కొల్లగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 18వ సీజన్లో మాత్రం తడబడుతోంది. ఒకప్పుడు చిన్న లక్ష్యాలను సైతం కాపాడుకున్న ఈ జట్టు.. ఈసారి బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమవుతోంది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై విజయం మినహా.. వరుసగా ఓడుతూ వచ్చిన సీఎస్కే 2 పాయింట్లతో అట్టడుగున ఉంది.
CSK fans, what do you make of MS Dhoni returning to captaincy? #ICYMI: Ruturaj Gaikwad has been ruled out for the rest of #IPL2025 👉 https://t.co/3TLXvGJSIA pic.twitter.com/raFoZhWIF7
— ESPNcricinfo (@ESPNcricinfo) April 10, 2025
రెండో విజయం కోసం నిరీక్షిస్తున్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సేవల్ని కోల్పోయింది. మోచేతికి గాయంతో అతడు టోర్నీ నుంచి వైదొలగడంతో మళ్లీ ఎంఎస్ ధోనీ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ధోనీ వచ్చాక కూడా పరిస్థితి మారలేదు. తమకు కొట్టినపిండి అయిన చెపాక్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల విజృంభణతో 104కే పరిమితమైన సూపర్ కింగ్స్.. చిత్తుగా ఓడిపోయింది.