Meghna Alam: దౌత్యవేత్తతో రిలేషన్.. బంగ్లాదేశ్ మోడల్ మేఘనా అరెస్టు
Meghna Alam: బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్, నటి మేఘనా ఆలమ్‌ను .. ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ పవర్స్ యాక్టు ప్రకారం ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఓ విదేశీ దౌత్యవేత్తతో తనకు సంబంధం ఉన్నట్లు ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.
ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్, నటి మేఘనా ఆలమ్(Meghna Alam)ను .. ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ పవర్స్ యాక్టు ప్రకారం ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఓ విదేశీ దౌత్యవేత్తతో తనకు సంబంధం ఉన్నట్లు ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. దీంతో ఆ దేశ పోలీసులు ఆమెను ఏప్రిల్ 9వ తేదీన అరెస్టు చేశారు. సౌదీ అరేబియాకు చెందిన పెళ్లి అయిన దౌత్యవేత్తతో తనకు లింకు ఉన్నట్లు ఆ మోడల్ తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నది. అయితే ఆ దౌత్యవేత్తను తనను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె ఆరోపించింది.
బంగ్లాదేశ్‌లో మేఘనా ఆలమ్ ఓ పేరున్న నటి. మిస్ ఎర్త్ బంగ్లాదేశ్ పోటీల్లో ఆమె మాజీ విజేత. మిస్ బంగ్లాదేశ్ ఫౌండేషన్‌కు ఆమె చైర్పర్సన్ కూడా. మేఘనాను అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయ్యింది. అధికార దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మేఘనా ఫేస్బుక్లో దౌత్యవేత్త గురించి ఉన్న పోస్టులను డిలీట్ చేశారు. కూతురు చేసిన ఆరోపణలను ఆమె తండ్రి సమర్థించారు. సౌదీ అంబాసిడర్‌తో తన కుమార్తె రిలేషన్లో ఉన్నట్లు బద్రుల్ ఆలమ్ తెలిపారు.
వాస్తవానికి మేఘనాను కిడ్నాప్ చేసినట్లు తొలుత ఆరోపణలు వచ్చాయి. మేఘన ఇంట్లోకి పోలీసులు వచ్చి అరెస్టు చేస్తున్న దృశ్యాలు ఫేస్బుక్లో 12 నిమిషాల పాటు లైవ్ అయ్యింది. దీంతో అధికారులు రియాక్ట్ అయ్యారు. చట్టం ప్రకారమే మేఘనాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాషింపుర్ సెంట్రల్ జైలుకు ఆమెను తరలించినట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

