Nizamabad | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 14: నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవ్ పల్లి నెమలి నాచుపల్లి నస్రుల్లాబాద్ దుర్కి తదితర గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నాయకులు అధికారులు ఘనంగా నిర్వహించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విట్టల్, మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, నస్రుల్లాబాద్ విండో చైర్మన్ గంగారాం, మాజీ కో ఆప్షన్ సభ్యుడు మాజీద్, నాయకులు కంది మల్లేష్, ఇక్బాల్, యూసుఫ్, ఖలీల్, బిజెపి నాయకులు సున్నం సాయిలు, నారాయణ మల్లేష్, బీఆర్ఎస్ నాయకులు నర్సింలు గౌడ్, సాయిలు, అల్లం గంగారం తదితరులు పాల్గొన్నారు.
కోటగిరిలో..
కోటగిరి : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను కోటగిరి లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి మాల మహానాడు ఆధ్వర్యంలో పలువురు నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలమాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.