ఖిలావరంగల్, ఏప్రిల్ 14: భారతరత్న అవార్డు గ్రహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేయాలని వరంగల్ జిల్లా బీజీపీ అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్ అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చింతల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజ్యాంగ నిర్మాణం చట్టాల అమలులో అంబేద్కర్ పాత్ర మరువలేనిదన్నారు. అయన అత్యంత పేదరికంలో పుట్టి చిన్నతన్నంలో ఎన్నో కష్టాలు అనుభవించి చదువు ద్వారా రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడని గుర్తుచేసాడు.
నేటి సమాజం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ చిన్నతనం నుండే ప్రతి ఒక పౌరుడు దేశభక్తితో, జాతీయ భావాలను కలిగి ఉండాలని సూచించాడు. చింతల్ ప్రాంతంలో గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి ప్రతి సంవత్సరం మహిళలు, పిల్లలు, పెద్దలు, విద్యావంతుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లూరి గణేష్, విజయ్, కుమ్మరి రజినీకాంత్, పతి జంపయ్య, మునుపటి ఎల్లయ్య,మునుపటి నవీన్, క్రాంతి కుమార్, ఈదూల కుమార్, ఈదూల సందీప్, బతుల రమేష్, భాగ్య, రజియా సుల్తానా, విజయ, దుస్స శ్రీధర్, బంక రాజకుమార్, ఆకారపు శేఖర్, సిద్ధ రాజ్, జోగు మధు, జోగు రాజేంద్రప్రసాద్, శాఖమూరి నవీన్, బోయిని భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.