IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తన కెప్టెన్సీ మ్యాజిక్ చేయనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నిష్క్రమణతో చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన మహీ.. జట్టును గెలుపు తోవ పట్టించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తాలాను ఓ రికార్డు ఊరిస్తోంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohi)ని దాటేసేందుకు ధోనీకి మళ్లీ సువర్ణావకాశం దొరికింది. అదేంటో తెలుసా..?
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ 143 మ్యాచుల్లో సారథ్యం వహించాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా 4,994 రన్స్ కొట్టాడు విరాట్. చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడిగా 226 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4,660 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆర్సీబీకి 2013 నుంచి 2021 వరకూ నేతృత్వం వహించిన కోహ్లీ ప్రస్తుతం ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. దాంతో, మళ్లీ సీఎస్కే పగ్గాలు చేపట్టిన ధోనీ ఇంకో 335 రన్స్ కొడితే విరాట్‌ను అధిగమిస్తాడు. 18వ సీజన్లో మునపటిలా చెలరేగి ఆడలేకపోతున్న మహీ.. ఈసారి ఈ రికార్డును బ్రేక్ చేస్తాడా? లేదా? చూడాలి.
ఐపీఎల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లీ, ధోనీలు అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ మూడో ప్లేస్ సాధించాడు. ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన హిట్‌మ్యాన్ 3,986 పరుగులు బాదాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండు టైటిళ్లు అందించిన గౌతం గంభీర్ సారథిగా 129 మ్యాచుల్లో 3,518 రన్స్ స్కోర్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ 83 మ్యాచుల్లో 3,356 రన్స్‌తో టాప్ 5లో చోటు సంపాదించాడు.
The MAN who turned MI into a title machine👑🏆
🏆 5 IPL Titles ( 2013, 2015, 2017, 2019, 2020 )
🏏 Most Runs for MI ( 5769 runs)
🧢 Most Runs as MI Captain (4159 runs)
📋 Most Matches as MI Captain (163 matches)
🌟 Most POTM Awards for MI (17 times)
🧢 Most Matches for MI (225… pic.twitter.com/zqVcMRZ1ND— CricTracker (@Cricketracker) April 10, 2025