వెల్దండ : వెల్దండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం ( Mudiraj Sangam ) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే ( Jyotirao Phule ) చిత్రపటానికి ముదిరాజ్ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపడానికి మహాత్మ జ్యోతిరావు పూలే కృషి చేశారని అన్నారు.
సంఘ సంస్కర్తగా మహిళా విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి పాటు పడాలని కోరారు.ఈ కార్య క్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు నుకం వెంకటయ్య, క్యాసారపు వెంకటయ్య, కృష్ణ ముదిరాజ్, లింగం బాలరాజ్, మల్లయ్య, మాజీ ఎంపీపీలు పుట్ట రామ్ రెడ్డి జయప్రకాష్, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్, సింగల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మల్లయ్య దుబ్బ నాగేష్, నిరంజన్, ఎర్ర శ్రీను ముదిరాజ్, శ్రీశైలం, దేవేందర్, శివ, మల్లేష్, గోపాల్, విజయ్, యాదగిరి, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.