Kondapochamma | జగదేవపూర్, ఏప్రిల్ 11 : మండలంలోని తీగుల్ నర్సాపూర్ ప్రసిద్ద కొండపోచమ్మ దేవాలయ హుండీని దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు వివిధ కానుకలను హుండీలో వేసి ముడుపులు చెల్లించుకున్నారు. 59 రోజులకు గాను హుండీ లెక్కింపు చేపట్టగా హుండీ ఆదాయం రూ. 8,01,105 వచ్చినట్లు సిద్దిపేట దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. అమ్మవారికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్దికి వినియోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజిత రమేశ్, ధర్మకర్తలు చెక్కల నరేశ్, సిబ్బంది మహేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, కనకయ్య, హరిబాబు, పూజారులు మల్లయ్య, లక్ష్మణ్, కొండయ్య, తిరుపతి, గోవర్ధన్ తదితరులు ఉన్నారు.