IND VS ENG : ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ (England) డ్రైవింగ్ సీట్లో నిలిచింది. భారత్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. జాక్ క్రాలే (52 నాటౌట్), బెన్ డకెట్ (43)లు బజ్ బాల్ ఆటతో విరుచుకుపడి స్కోర్ బోర్డును ఉరికించారు. టీమిండియా బ్యాటర్లు అవస్థలు పడిన చోటనే దంచికొడుతూ జట్టు స్కోర్ 7 ఓవర్లకే యాభై దాటించారు.
తొలి వికెట్‌కు 92 రన్స్ జోడించి గిల్ సేన పేస్ దళం ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీశారిద్దరూ. అయితే.. ఆకాశ్ దీప్ ఓవర్లో రిస్కీ షాట్ ఆడి డకెట్ వెనుదిరగగా.. ఆ తర్వాత కెప్టెన్ ఓలీ పోప్(12 నాటౌట్)తో కలిసి ఉతికేసిన క్రాలే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడికిది మూడో ఫిఫ్టీ. ఓవరాల్‌గా పంతొమ్మిదవది. క్రాలే, పోప్లు దూకుడుగా ఆడడంతో లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 109 రన్స్ కొట్టింది ఇంగ్లండ్.
Lunch on Day 2 of the fifth Test at the Oval 🏟️
England 109/1 in the 1st innings, trail by 115 runs
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#TeamIndia | #ENGvIND pic.twitter.com/uPyCbxPgmR
— BCCI (@BCCI) August 1, 2025
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఓవల్ టెస్టులో భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు. ఇంగ్లండ్ ఓపెనర్లకు కళ్లెం వేయలేక శుభారంభానికి అవకాశమిచ్చారు. టీమిండియాను 224కే ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు మెరుపు వేగంతో తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (43), జాక్ క్రాలే(48 నాటౌట్)లు బౌండరీలతో చెలరేగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డకెట్ అయితే.. స్వీప్, స్కూప్ షాట్లతో విరుచుకుపడుతూ భారత బౌలర్లను ఒత్తిడిలో పడేశాడు. కానీ, ఆకాశ్ దీప్ ఓవర్లో వికెట్ల వెనకాలకు ఆడబోయిన అతడు గురి తప్పి.. జురెల్ చేతికి దొరికిపోయాడు. అతడు ఔట్ కావడంతో దాదాపు 8 రన్ రేటుతో సాగిన ఓపెనర్ల పరుగుల వరదకు తెరపడింది.