Pending issues | చిగురుమామిడి, ఆగస్టు 1: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి
డిమాండ్ చేశారు. మండలంలోని సుందరగిరి గ్రామ పరిధిలోనీ ఇప్పలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కక్కెర్ల వెంకటమల్లు పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పదవీ విరమణ పొందుతున్న కక్కెర్ల వెంకటమల్లు 36 సంవత్సరాల ఉద్యోగం జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురుకొని విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించి వారి కుటుంబ సభ్యులను కూడా ఉన్నత విద్యావంతులుగా చేసినాడని కొనియాడారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐదు డిఏలు, పి ఆర్ సి, మెడికల్ రియంబర్స్మెంట్, పెన్షనర్ల ఆర్థిక సమస్యలు, వారికి అందించేటటువంటి నగదునుసౌకర్యాలు వెంటనే పరిష్కరించాలని అన్నారు.
పదవి విరమణ పొందిన వారు ప్రభుత్వ నుంచి వచ్చే పెన్షన్ పై ఆధారపడతారని, వారు దాచుకున్న జీపీఎఫ్, గ్రాటివిటీ ఇయర్ కు సంబంధించిన పెన్షనర్లకు తొందరగా అందించాలని అన్నారు. పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి, 50% పి ఆర్ సి ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అప్పటివరకు కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలం వేతనాన్ని, వాళ్లకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.