శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 29, 2020 , 19:06:28

CSK vs KKR: ఫీల్డింగ్‌ ఎంచుకున్న ధోనీ

CSK vs KKR:  ఫీల్డింగ్‌ ఎంచుకున్న ధోనీ

దుబాయ్:‌ ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి.  ప్లేఆఫ్‌ రేసులో ఉన్న కోల్‌కతాకు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. డుప్లెసిస్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, మోనూ కుమార్‌ స్థానంలో  షేన్‌ వాట్సన్‌, లుంగీ ఎంగిడి, కర్ణ్‌ శర్మ తుది జట్టులోకి వచ్చారు. 

తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్న కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని చెన్నై ఎలా ఎదుర్కొంటుందో ఆసక్తికరంగా మారింది.  చెన్నైపై భారీ తేడాతో గెలుపొందాలని కోల్‌కతా భావిస్తోంది.  ఇప్పటి వరకు ఆడిన 12  మ్యాచ్‌ల్లో  కోల్‌కతా 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. ప్రస్తుతం 12 పాయింట్లతో  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో సమానంగా ఉంది.  రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా పంజాబ్‌ నాలుగులో ఉండగా..కోల్‌కతా ఐదో స్థానంలో నిలిచింది.