Chateshwar Pujara : భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఛటేశ్వర్ పుజారా (Chateshwar Pujara) రెచ్చిపోయాడు. పునరాగమనంపై కన్నేసిన నయావాల్ రంజీ ట్రోఫీ (Ranji Trophy 2024-25)లో రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ అంటే చాలు పూనకాలు వచ్చినట్టు ఆడే పుజారా తాజాగా ద్విశతకంతో గర్జించాడు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న అతడు ఛత్తీస్‌గఢ్ బౌలర్లను ఉతికేస్తూ తొమ్మిదో డబుల్ సెంచరీ సాధించాడు. 348 బంతుల్లో 22 ఫోర్లతో పుజారా రెండొందలు కొట్టేసి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 18వ సారి ఆ ఘనతకు చేరువయ్యాడు.
అంతేకాదు రంజీల్లో 9వ డబుల్ సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా పుజారా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. తద్వారా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మాజీ ఆటగాడు పరాస్ డొగ్రా(Paras Dogra) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీమిండియా తరఫున మూడో స్థానంలో మళ్లీ ఆడేందుకు తాను సిద్దమే అని పుజారా చెప్పకనే చెబుతున్నాడు.
CHETESHWAR PUJARA IS BACK👏
– Pujara, the run machine, scored his 18th First Class double century today.🙌🏻
– He also completed his 21000 First Class runs today. A monumental achievement 🙌🏻
– He really is a priceless diamond that shines brighter than the skies🫡
SELECTORS 👀 pic.twitter.com/Ovm6296nen
— The Khel India Domestic & League (@TKI_Domestic) October 21, 2024
అయితే.. న్యూజిలాండ్‌తో చివరి రెండు టెస్టులకు సెలెక్టర్లు అదే స్క్వాడ్‌ను కొనసాగించడంతో పుజారాకు అకవాశం లేనట్టే అనిపిస్తోంది. ఒకవేళ పుణేలోనూ పరిస్థితులు అనుకూలించని పక్షంలో.. ఢిల్లీ టెస్టుకు, ఆపై ఆస్ట్రేలియా పర్యటనకు పుజారాను ఎంపిక చేసినా చేయొచ్చు.
వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలనుకుంటున్న భారత్‌కు న్యూజిలాండ్ దిమ్మదిరిగే షాకిచ్చింది. బెంగళూరు టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో పుణే, ఢిల్లీ వేదికగా జరుగబోయే రెండు టెస్టుల్లో టీమిండియా తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఇక మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ బదులు ఆడిన విరాట్ కోహ్లీ (0,70) పర్లేదు అనిపించినా భారీ స్కోర్ చేయలేకపోయాడు.
Shubman Gill Arrived in Pune Airport.
Shubman Gill Ready For Next test match #ShubmanGill @ShubmanGill pic.twitter.com/f4Jei0cEF9
— Cricket addicted 🏏🇮🇳 (@VikashJ13660845) October 21, 2024
ఈ పరిస్థితుల్లో పుణే టెస్టుకు గిల్ అందుబాటులో ఉండడం ఖాయమనిపిస్తోంది. తొలి మ్యాచ్‌కు దూరమైన అతడు నెట్స్‌లో సాధన చేస్తూ కనిపించాడు. ఇక చిన్నస్వామి స్టేడియంలో నిరాశపరిచిన సిరాజ్ స్థానంలో యువ పేసర్ ఆకాశ్ దీప్ కూడా జట్టులో ఉండే అవకాశముంది. అక్టోబర్ 24న భారత్, న్యూజిలాండ్‌ల మధ్య రెండో టెస్టు జరుగనుంది.